అస్సలు ఇంట్లో ఉదయం వేళ బయటకు పోయి కాసేపు వాకింగ్ ,జాగింగ్ ,రన్నింగ్ లకు అవకాశమే లేదా?  జిమ్ కు వెళ్ళలంటే కూడా అసాధ్యమేనా?  అయితే ఈ చిన్న టిప్స్ మీ కోసం అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఇంట్లో ఉండే ఫుట్ బాల్ ,వాలీ బాల్ ను రెండు చేతులతో పట్టుకొని కుడినుంచి ఎడమకు , ఎడమ నుంచి కుడికి అరవైసార్లు తిప్పాలి. మిగతా భాగం నుంచి నడుము వరకు పేరుకొన్న కొవ్వు కరిగి శరీరం ఫ్రీగా అయిపోతుంది. అలాగే ఒక కర్ర తీసుకొని దాన్ని భుజాలపై పెట్టుకొని రెండు వైపులా వంగే వ్యాయామం చేయవచ్చు. కుడి నుంచి ఎడమకు , ఎడమ నుంచి కుడికి తిరగాలి. నీళ్ళ సీసాను కుడి చేతిలోకి ఎడమ చేతిలోకి మార్చు కొనే ప్రయత్నం చేయవచ్చు. కాళ్ళ కింద వేసుకొనే స్టూలు చిన్నది. దానిపై వేగంగా ఒక్కొ కాలుతో ఎక్కిదిగుచ్చు. తప్పకుండా ఏదైనా ఆధారం తీసుకోవాలి. లేదా రెండు మెట్లు ఎక్కటం దిగటం వేగంగా చేసిన వ్యాయామమే.

Leave a comment