ఈ అద్భుతమైన ఫ్రెంచి సినిమాలో పెద్ద ట్విస్ట్ లు ఉండవు.  ప్యారిస్ కు దగ్గరగా ఉన్న పల్లెటూరులో ఒక ముసలాయన దగ్గరకు కోడుకు,కోడలు, ముగ్గురు మనవళ్ళు వస్తారు.  ఒక ఆదివారం పూట రోజంతా ఆయనతో గడిపి వెళ్ళిపోతారు. మన పల్లెటూరు పెద్దవాళ్ళు వాళ్ళతో కలిసి గడపటం లో ఉన్న ఆనందాన్ని జ్ణాపకానికి తెచ్చే ఈ పల్లెలో ఒక ఆదివారం సినిమాకు ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరక్టర్ , బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇలా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఫ్రెంచ్ డైరక్టర్ Tavernier కు ఎంతో పేరు వచ్చింది. మన మూలాలను గుర్తుకు తెచ్చే ఈ సినిమాను అందరూ చూడంది.

Leave a comment