టీనేజ్ పాప్ సింగర్ బిల్లీ ఎలిష్ గ్రామీ అవార్డ్ అందుకొన్నా అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది . 18 సంవత్సరాల బిల్లీ లాస్ ఏంజిల్స్ లోని చిల్డ్రన్ సింగర్స్ బృందంలో సభ్యురాలు . అక్కడే సంగీతం లో మెళుకువలు నేర్చుకొన్నది . ఆమె పాడే పాటలన్ని వాళ్ళ అన్నయ్య ఫిన్నేయాన్ రాసినవే . అతనే బిల్లీకి పాటలు రాయటం వాటిని ప్రొడ్యూస్ చేయటం నేర్పించాడు . ఆమె తల్లిదండ్రులు ఇద్దరికీ నటన ,సంగీతం వచ్చు 2016 లో ఓషియన్ ఐస్ ఆల్బమ్ విడుదలయ్యాక ఆమె అందరి దృష్టిలోకి వచ్చింది . ఆమె తన అన్నయ్యతో కలసి చేసిన మొదటి ఆల్బమ్ ” వెన్ వి ఆల్ ఫాల్ ఎస్లీప్ వేర్ డూ వీ గో ” సూపర్ హిట్ అయింది . 62 వ గ్రామీ వేడుకల్లో బిల్లీ ఐదు విభాగాల్లో అవార్డు లు అందుకొంది .

Leave a comment