అభయారణ్యంలో అంబరాన్నంటే సంబరం.చెట్టు-పుట్టా తోరణాలుగా అలంకరించుకునే ప్రకృతమ్మ మన సమ్మక్క-సారలమ్మ జాతర.

కాకతీయుల వీరుడైన ప్రతాపరుద్రుడు కోయదొరల సామంతుడైన పగిడిద్ద రాజుని కప్పం కట్టలేదని యుద్ధం ప్రకటించారు.పగిడిద్దరాజు భార్య సమ్మక్క పిల్లలు సారలమ్మ,నాగులమ్మ,జంపన్న.పంటలు లేక  కప్పం కట్టలేక కరువుతో బాధ పడుతున్న సమయంలో యుద్ధానికి పగిడిద్దరాజు సిధ్ధం అయ్యాడు.సంపెంగ వాగు దగ్గర యుద్ధం ప్రకటించారు. పగిడిద్ద రాజు,సారలమ్మ,నాగులమ్మ ,అల్లుడు గోవింద రాజు వీరమరణం పొందారు.సమ్మక్క యుద్ధ భూమిలో అడుగు పెట్టి భీకర పోరాటం చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు వెన్నుపోటు పొడిచారు.సమ్మక్క మనోబలంతో నేలకొరగక చిలకలగుట్ట వద్దకు వెళ్ళీ అదృశ్యం అయ్యి కుంకుమభరిణ రూపంలో ప్రత్యక్షం అయ్యింది.
నిత్య ప్రసాదం: కొబ్బరి,బెల్లం

          -తోలేటి వెంకట శిరీష

Leave a comment