Categories
71 ఏళ్ల రాధా మణి 11 వాహనాలు నడపడం తో లైసెన్స్ పొందారు. ఇప్పుడు మహిళల కోసమే డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నారు. కేరళకు చెందిన రాజమణి భర్త ఏ టు జెడ్ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవారు. 1970 లో ఆయన మరణించాక అది మూల పడింది. ఇద్దరు కొడుకుల సపోర్టుతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన రాధామణి ట్రాక్టర్, రోడ్ రోలర్ వంటివి నడపడం నేర్చుకొన్నారు. 1993లో స్కూటీ లైసెన్స్ తీసుకున్న రాధా మణి 1998 లో బస్, లారీ లైసెన్స్ కూడా తీసుకున్నారు. ఆటో నుంచి ట్రాక్టర్, జెసిబి, క్రేన్ వంటి 11 వాహనాలు నడపగలరు. హెవీ వెహికల్స్ నడపడం నేర్పించే డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన తొలి మహిళ కూడా ఈమె. ఎప్పుడో భర్త ప్రారంభించిన డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు పిల్లలు మనుమళ్ల తో కలిసి చూసుకుంటోంది రాధా మణి.