Categories
ఖరీదైన చీరెలు కట్టాలనుకున్న వారి కళను నిజం చేశాం. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల వారికి చీరెలు సరఫరా చేశాం అంటున్నారు ‘ఎం ఓ ఎస్ ప్రీ లవ్డ్’ వ్యవస్థాపకులు సుస్మితా మిశ్ర ఆమె చెల్లెలు సునీత. 11 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ ఆన్ లైన్ వేదిక పైన ఎవరైనా ఒకసారి ఉపయోగించిన చీరలను అమ్మవచ్చు కొనుక్కోవచ్చు. అంటే వేడుకల కోసం కొనుక్కొని తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించలేని సరికొత్త పాత చీరెల ఆన్ లైన్ షాప్ అన్నమాట. మన్నిక ఆధారంగా దీనిలో అమ్మకానికి అవకాశం ఇస్తారు. ఈ వెబ్ సైట్ ను నెలకు పదివేల మంది చూస్తారు. కొనుగోళ్లు జరుగుతాయి.