బీట్ రూట్ క్యాన్సర్ ను మూడు రకాలుగా అడ్డుకుంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ లో ఉండే బిటా లెయిన్స్ అనే పోషకం చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. క్యాన్సర్ నివారణ లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. బీట్ రూట్ లోని విటమిన్-సి వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బీట్ రూట్ రక్తం లోని హిమోగ్లోబిన్ పెంచడం ద్వారా అన్ని కణాలకు ఆక్సిజన్ పెంచడానికి దోహదపడుతుంది. పెరిగిన హిమోగ్లోబిన్ తో బీట్ రూట్ లోని పోషకాల వల్ల ఎక్కువ సేపు మరింత స్టామినా తో వ్యాయామం చేసే సామర్థ్యం పెరుగుతుంది. దానితో కణాలకు ఆక్సిజన్ పెరుగుతుంది. ఈ అంశం కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడేదే.

Leave a comment