బాలిక పంచాయత్ పేరుతో గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది 11-21 ఏళ్ల వారి కోసం మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఈ తరహాలో ఇదే మొదటిది. రాష్ట్రం లోనే కచ్ జిల్లాలో ఏడాదిగా నిర్వహిస్తున్నారు. అమ్మాయిల లో సామాజిక స్పృహను  చైతన్యాన్ని పెంచి వారికి రాజకీయాల పట్ల ఆసక్తి కలిగించడం దీని ప్రధాన ఉద్దేశం. గ్రామ ఎన్నికల లాగానే బాలిక పంచాయత్ లకు పోటీ ఉంటుంది. అమ్మాయిలంతా కలిసి ఒక సర్పంచ్ ను సభ్యులను ఎన్నుకుంటారు గ్రామంలో ఏ అమ్మాయికైనా సమస్య వస్తే సర్పంచ్ చూసుకుంటుంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు పరచనున్నారు.

Leave a comment