ఏ శుభకార్యం వచ్చిన ముందుగా మామిడి తోరణాలు కొబ్బరి ఆకుల పందిళ్ళు, కొబ్బరి పిలకలు ,మల్లెలు ,బంతిపూల మాలలతో అలంకరిస్తారు. అసలీ సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే పండుగ సందర్భంగా ఎక్కువ మంది బంధువులు ,స్నేహితులు రావవటంతో ఆ ఆ వాతావరణం లో కార్బన్ డైఆక్సైడ్ వల్ల గాలి కలుషితం అవుతుంది. మామిడి ,కొబ్బరి ,అరటి ఆకులు చెట్టునుంచి తెంచి తెచ్చిన అవి చాలా సేపు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అలాగే పూల మూలికల్లో సుగంధం అక్కడ పండుగా వాతావరణాన్ని పరిమళ భరితం చేస్తుంది. గడపకు పూసే పసుపు ,వేసే ముగ్గలు అన్నింటిలోనూ వాతావరణాన్ని శుధ్ధిచేసే లక్షణాలే ఉంటాయి.

Leave a comment