Categories
శాన్ ఫ్రాన్సిస్కో లోని ఏవియేషన్ మ్యూజియం లో మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటు దొరికింది. కోవిడ్ కోరలు సాచిన సమయంలో వందే భారత్ మిషన్ లో భాగంగా విమానంలో విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చింది జోయా. నలుగురు మహిళా పైలట్ లతో ఉత్తర ధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జోయా ను ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా నియమించారు. జోయా వంటి పైలెట్ లు బాలికలకు స్ఫూర్తి.