Categories
ప్రకృతి మనిషిని ఎప్పటికప్పుడు కొత్తగా ఆశ్చర్యపోయేలా చేస్తూనే ఉంది. ఇండోనేషియా లోని తూర్పు సుంభ ద్వీపం లోని వలికిరి తీరంలో మాడ అడవులు ఎంతో ప్రత్యేకం అక్కడి చెట్లన్నీ మరుగుజ్జు రకానికి పైగా ఏదో నాట్యం చేస్తూ ఆగిపోయినట్లు కనిపిస్తాయి. అందుకే వీటిని డాన్సింగ్ ట్రీస్ అంటారు. సూర్య అస్తమయం సమయం లో సముద్రం వెనక్కి తగ్గుతుంది. నేలంతా తెల్లని మెరిసే ఇసుక దానిపైన ఈ నర్తించే చెట్లు వాటి నీడలో ప్రకృతి తీర్చిదిద్దిన ఈ సుందరమైన పెయింటింగ్స్ చూసి కెమెరాల్లో బంధించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టూరిస్ట్ లు ఇక్కడికి వస్తారు. ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా కనిపించే లోకేషన్స్ లో ఈ వలకిరి తీరం ఒకటి.