Categories
Nemalika

వత్తిడి తగ్గించుకొనే పద్ధతులివే

నీహారికా,

పరీక్షల ముందుగానీ, ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా, ఇంట్లో పని ఎక్కువైనా, ఒకేసారి ఎన్నో పనులు చేయవలసి వచ్చినా ఒత్తిడి ఎక్కువై పని మీద ఏకాగ్రత తగ్గిపోయి కంగారుగా వుంటుంది. అయితే ఏ మందులు లేకుండా ఇందులోంచి బయట పడే మార్గాలున్నాయి. ముందర ఒత్తిడి గా అనిపిస్తే నలుగురి మధ్య కూర్చుని కబుర్లు చెపితే ఆ సందడికి ఒత్తిడి మాయం అవుతుంది. అలాగే ఒకేసారి పనుల ఒత్తిడి అనుకుంటే ఇందుకు కారణం సరైన ప్రణాళిక లేకపోవడం కావచ్చు. ఆ పనులను పేపర్ పైన రాసుకుని, అవసరమైన క్రమంలో ఆ పనులు పట్టిక రాసి, ప్రతిదానికి అవసరమైన వస్తువులు అందుబాటులో పెట్టుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఆ పనులు పూర్తి చేసుకోవాలి. ఒక్కోసారి మరీ భరించలేని వత్తిడిలో తలకు వెచ్చని నూనెతో మర్దన చేసుకుని లావెండర్ ఆయిల్ నీటితో స్నానం చేస్తే ఆ సువాసనకు, మసాజ్ కు సగం వత్తిడి పోతుంది. చేయాల్సిన పనుల్లో మన ప్రమేయం అవసరం లేని పనులు తగ్గించుకుంటూ వస్తే సగం భారం తగ్గుతుంది.

Leave a comment