ఉత్తర ప్రదేశ్ లోని ఆరు జిలాల్లోని 150 కి పైగా గ్రామాల్లో 14 వేల మంది సభ్యులతో గ్రీన్ గ్యాంగ్ పనిచేస్తోంది. గృహహింస పైన దానికి దారితీస్తున్న వ్యసనాల పైన మహిళలు చేసిన తిరుగుబాటు ఈ గ్రీన్ గ్యాంగ్ ఆవిర్భావం ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి జిల్లాలో 15 మంది మహిళల తో మొదలైన ఉద్యమం ఇప్పుడు పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇందులో సభ్యులు ఆకుపచ్చ చీరెలు ధరిస్తారు. మహిళలది ఒకే సమస్య ఇంట్లో మగవాళ్ళు తాగుడు,పేకాట కు సంపాదన ధారపోయడం గృహహింస,ఈవ్ టీజింగ్ వంటివి ఎదుర్కొనేందుకు ప్రారంభించిన ఈ ఉద్యమం ప్రభుత్వ గుర్తింపు పొందింది. మహిళా సంక్షేమం కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ శక్తి తో కలిసి గ్రీన్ గ్యాంగ్ పనిచేస్తోంది. వీరు గృహహింస కు పాల్పడిన వాళ్ళ పై పోలీస్ కేసులు పెట్టడం పురుషులతో తాగుడు మాన్పించటం వంటివి చేస్తారు.
Categories