Categories

అస్తమానం వాడే స్విచ్ బోర్డ్ లు మురికిగా మరకలు పడి జిడ్డు పట్టేస్తాయి. ముఖ్యంగా వంటింటి స్విచ్ లు ఎక్కువ మురికిగా ఉంటాయి. నిమ్మరసం లో బేకింగ్ సోడా కలిపి దానితో స్విచ్ బోర్డు తుడిస్తే దుమ్ము జిడ్డు పోతుంది. నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా మరకలు పోగోడుతుంది. టూత్ పేస్ట్ కూడా వాడి ఈ స్విచ్ బోర్డ్ మరకలు తొలగించవచ్చు. అయితే శుభ్రం చేసే ముందర మెయిన్ స్విచ్ ఆపేయాలి.