Categories
మొహం జిడ్డుగా అయిపోతూ ఉంటే ఇంట్లోనే కొన్ని ప్యాక్స్ వేసుకోవచ్చు. రసాయనాలు లేని ఈ ప్యాక్స్ మంచి ఫలితం ఇస్తాయి.కోడిగుడ్డు తెల్లసొన లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.మార్కెట్ లో దొరికే పాక్స్ వేసే బ్రష్ తో సమానం గా వచ్చే లా వేసుకోవచ్చు. ఇది ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగితే చాలు ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడి లో అంతే తేనె అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ బజార్లో దొరుకుతుంది. రెండు స్పూన్ల మొక్కజొన్న లో అంతే మోతాదు వేపాకు రసం చందనం పొడి రెండు మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి కలిపితే మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది.