ఉబెర్ టు వీలర్ రైడర్ గా తన స్కూటర్ పైన ఎంతో మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది మౌతుషి బసు. కరోనా కాలంలో ఉద్యోగం పోవటం తో ఎన్నో ప్రయత్నాలు అనంతరం ఉబెర్ లో టూ వీలర్ రైడర్ గా చేరింది. అనుకోకుండా రణవీర్ భట్టాచార్య అనే రైడర్ ఇటీవల మౌతుషి టూవీలర్ ఎక్కి డ్రైవర్ అమ్మాయి అని తెలుసుకుని ఆమె తో మాట్లాడి సోషల్ మీడియాలో ఈ విషయం పోస్ట్ చేశాడు. కుటుంబం కోసం శాయశక్తులా కృషి చేస్తున్న మౌతుషి ని వేల సంఖ్యలో వీక్షకులు ప్రశంసించారు. ఎంతో మంది యువ తరానికి ఆమె ప్రేరణ అంటున్నారు.

Leave a comment