సేవను పనిలా కాక పిల్లల్ని పెంచి నంత బాధ్యత గా చేయాలంటారు సుధామూర్తి. రచయిత్రిగా ఎదిగిన సుధా మూర్తి ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. టాటా సంస్థ లో ఇంజనీర్ గా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు. 1996 లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రారంభించారామె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేశవ్యాప్తంగా గ్రంధాలయాలు ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య వైద్య సహకారం గ్రామాభివృద్ధి కళలు సంస్కృతి వంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. కోవిడ్ సమయంలో 200 కోట్ల రూపాయలు వితరణ గా ఇచ్చారు. సెక్స్ వర్కర్స్ జీవితాలను మార్చి వారికి ఓ మార్గం చూపించటం కోసం కృషి చేస్తున్నారు సుధామూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సుధామూర్తి చైర్ పర్సన్.

Leave a comment