ఈ ఎండలకు చర్మం నల్లబడి పొడిబారీ,మృతకణాలతో నిర్జీవంగా అయిపోతూ ఉంటుంది. ఖరీదైన స్క్రబ్ ల కంటే అందుబాటులో ఉండే పదార్థాలతో రకరకాల పూతలు తయారు చేసుకోవచ్చు. చక్కర నిమ్మరసం బాధం నూనెలు కలిపి శరీరంపై రాసుకోని కడిగేస్తే పొడిబారి ,నిర్జీవంగా అయితే చర్మం ఛాయ మెరుగవుతుంది. ఇది వాడాక మాయిశ్చరైజర్ తప్పని సరిగా రాయాలి.ఆలాగే తేనె,చక్కెర నిమ్మరసం,ఆలీవ్ నూనె ,కాస్త కాఫీ పొడి కలిపి ఒంటికి రాసుకొని కాసేపటి తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా అయిపోతుంది. కాఫీ పొడి మృత చర్మాన్ని తొలగించి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అలాగే అరటి పండు తేనె చక్కెర బాధం నూనె ల మిశ్రమం కూడా చక్కని స్క్రబ్.

Leave a comment