అసోం కలెక్టర్ కీర్తి జల్లి తెలుగమ్మాయి వరదల్లో దెబ్బతిన్న కచార్ జిల్లాలో ఆమె అందిస్తున్న సేవలకు గాను ప్రశంసలు కురుస్తున్నాయి. సాదా చీర తో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా అధికారులతో కలిసి ఆమె వరద ప్రాంతాల్లో చేస్తున్న పర్యటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 15 జిల్లాల్లోని 1073 గ్రామాలను వరదలు ముంచెత్తితే అందులో కచార్ జిల్లా లోనే 291 వున్నాయి. అలాంటి సందర్భంలో కీర్తి జల్లి స్వయంగా బురద నిండిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించి సాయం అందించడం సహాయ శిబిరాల్లో సేవలను సమీక్షించడం చేశారు.

Leave a comment