Categories
అరుణాచల్ సిస్టర్స్ ఎన్గురాంగ్ మీనా రీనా లు మారుమూల ప్రాంతాల్లో కృషి చేస్తున్నారు. అరుణాచల్ అక్షరాస్యతలో వెనుకబడి ఉంది నాణ్యమైన విద్యను అందించేందుకు రోడ్ సైడ్ లైబ్రరీలు ప్రారంభించారు. మొదట్లో పుస్తకాలు ప్రజలు దొంగలించే వాళ్ళు కానీ,తర్వాత ప్రజలే వాటిని కాపాడుకోవటం మొదలుపెట్టారు. అన్ని పల్లెల్లో నూ ఇలాంటి లైబ్రరీలు ఏర్పాటు చేయాలనుకున్నారు మీనా రీనా లు వీరి కృషి ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఢిల్లీ,బెంగళూరు లో ఉన్నత చదువులు చదువుకున్న ఈ అక్క చెల్లెల్లు ఎన్గురాంగ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ ఎల్ ఐ) ద్వారా ఎంతో మంది నిరక్షరాస్యుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగిస్తున్నారు.