Categories

విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన రక్షణ దళ పారా మిలటరీ సిబ్బంది కి రాష్ట్రపతి ముర్ము కీర్తి చక్ర శౌర్య చక్ర పురస్కారాలు ప్రదానం చేశారు. అందులో భాగంగా గత ఏడాది సియాచీన్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు కెప్టెన్ అన్షుమన్ సింగ్ కు భారత్ రెండో అత్యున్నత పీస్ టైమ్ గ్యాలంటరీ పురస్కారం కీర్తి చక్ర లభించింది. అయిన తల్లితో కలిసి భార్య స్మృతి దీన్ని స్వీకరించారు.కెప్టెన్ అన్షుమన్ సింగ్ సియాచిన్ లో బేస్ కాంప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మంటల్లో చిక్కుకున్న జవాన్లను కాపాడి గాయాలపాలై అన్షుమాన్ సింగ్ మరణించారు నా భర్త హీరో,తాను మరణిస్తూ ఎన్నో కుటుంబాలను రక్షించారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు స్మృతి సింగ్.