Categories
జపాన్ లో ఉండే ఈ బౌద్ధాలయాన్ని డైవోర్స్ టెంపుల్ గా పిలుస్తారు. పెళ్లి బంధం నుంచి దూరం కావాలనుకునే వారు ఈ గుడికి వచ్చి మొక్కు కొంటారు. ఒకప్పుడు కేవలం స్త్రీలే ఈ ఆలయంలోకి వచ్చి విడాకులు కావాలని కోరి ఆశ్రయం తీసుకునేవారు. ఈ ఆలయంలోనే వారికి మూడేళ్ల పాటు రక్షణ ఇచ్చి అధికారుల చేత విడాకులు మంజూరయ్యేలా చేసేవాళ్ళు. 1902 వరకు ఈ ఆలయంలోకి పురుషులు వచ్చేవారు కాదు. ఇప్పటికీ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే విడాకులు త్వరగా వస్తాయని జపనీయుల నమ్మకం ప్రస్తుతం విడాకులకు సంబంధించిన అంశాల్లో ఆలయ అధికారులు పట్టించుకోకపోయినా డైవోర్స్ కోరుకునే వాళ్లు వస్తూనే ఉన్నారు.