హరియాణా కు చెందిన ప్రిత్పాల్ కౌర్ ముందుగా బి డి ఎస్ చదివి తర్వాత సివిల్ సర్వీసెస్ లోకి వచ్చారు. 2016 లో ఐ పి ఎస్ గా నాగాలాండ్ కు చెందిన ఫేక్  జిల్లా తొలి ఎస్పీ అక్కడ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేశారామె.యువకులకు సిల్క్ ట్రైనింగ్ స్వయం ఉపాధి యంత్రాలు ఇప్పించటం మాదకద్రవ్యాల బానిసలకు పునరావాసం చేశారు. స్త్రీలకు నెలసరి శుభ్రతతో పాటు ఆర్థిక నిర్వహణ అంశాలు నేర్పించారు. నాగా గిరిజనుల్లో ఒక గిరిజన తెగ తమ ఆరాధ్య దేవత పేరును ప్రిత్పాల్ కౌర్ కు పెట్టుకున్నారు. ఉత్తమ పోలీస్ అధికారిణిగా గౌరవంతో పాటు వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ గ్లోబల్ విమెన్ లీడర్ 2024 అవార్డులు కూడా ఈ ఐపిఎస్ అధికారిని వరించాయి.

Leave a comment