బబ్లీ గంభీర్ జాతీయ,అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ బ్యూటీషియన్ మధ్యప్రదేశ్ లోని జావరా గ్రామానికి చెందిన ఒక సిక్కు కుటుంబంలో ఎనిమిదో సంతానంగా పుట్టిన బబ్లీ కి పుట్టుకతో పొట్టి చేతులు ముడేసి వేళ్ళున్నాయి.ఎన్నో చేదు అనుభవాలతో పెరిగిన బబ్లీ ప్రముఖుల వద్ద శిక్షణ పొంది ఇందౌర్  లో పార్లర్ తెరిచింది.రెండేళ్లలో తన అపాయింట్మెంట్ తీసుకుంటేనే సేవలు అందుకోగలిగే స్థాయికి చేరింది. 15 జాతీయ అంతర్జాతీయ అవార్డులు 2013లో రాష్ట్రపతి అవార్డును అందుకుంది. సవాళ్లను ఎదురీది తేనే లక్ష్యం చేరుకొంటామని చెప్పే బబ్లీ జీవితం స్ఫూర్తిదాయకం.

Leave a comment