Categories
ఈ సంవత్సరం వచ్చిన మంచి పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ కాస్ట్ తప్పని సరిగా చదవలసిన పుస్తకాల్లో ఒకటి శైలజా పైక్ రాసిన ఈ పుస్తకం మహారాష్ట్ర కు చెందిన తమాషా డాన్సర్ ల గురించి రాసిన పుస్తకం ఇది.ఆ కళాకారుల సామాజిక మేధో చరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుస్తకం.హిస్టరీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ శైలజా పైక్ రాసిన మొదటి పుస్తకం పేరు దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడరన్ ఇండియా,డబుల్ డిస్క్రిమినేషన్,ఎరవాడ మురికి వాడలో పుట్టి పెరిగిన శైలజ కు పేదల కష్టాలు బాగా తెలుసు ఆ జ్ఞానం తోనే మహారాష్ట్ర లోని కళాకారుల జీవితానికి అర్థం పట్టే పుస్తకం రాసింది.