Categories
మహిళలను దుర్భాషలాడితే ఈ ఊర్లో జరిమానా కట్టాల్సిందే మహారాష్ట్ర లోని సౌందాలా గ్రామ ప్రజలు తీసుకున్న వినూత్న నిర్ణయం ఇది. మహిళలను ఎవరైనా తిట్టినట్లు తెలిస్తే 500 రూపాయలు కట్టాల్సిందే. 2024 నవంబర్ 28 నుంచి ఈ తీర్మానం అమల్లోకి తెచ్చింది సౌందాలా పంచాయతీ. ఈ నిబంధన స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. గ్రామంలో ఎక్కడికక్కడ మైక్రోఫోన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు రాత్రి నుంచి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొబైల్ ఫోన్లు వాడకూడదు అది పిల్లలు చదువుకునే టైమ్ గా నిర్ణయించింది. పంచాయితీ మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు సౌందాలా గ్రామస్తులు.