Categories

చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించారు మీర్జాపురం రాజా వారి తో వివాహం అయిన తర్వాత జయ పిక్చర్స్ సంస్థ బాధ్యత తీసుకున్నారు కృష్ణవేణి ఎన్టీఆర్ వంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేశారామె. జయ పిక్చర్స్ ను శోభనాచల స్టూడియోస్ గా పేరు మార్చి ఎన్నో సినిమాలు నిర్మించారు. కృష్ణవేణి తన 98 సంవత్సరాల వయసులో 2022లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల్లో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆవిడ కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించి మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్ సాధించారు.