116 మంది ప్రత్యర్థులను ఓడించి ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న స్టీఫనీ డెల్ వ్యులే మనసు కూడా ఎంతో అందమైనది డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధ పడుతున్న పిలల్ల కోసం ఒక ప్రాజెక్ట్ వర్క్ ప్లాన్ చేస్తోందిట. ఎకోయర్ ఆఫ్ ఏంజెల్స్ అనే మ్యూజిక్ థెరపీ ద్వారా ఆ వ్యాధితో పుట్టిన పిలల్లకు చికిత్స అందించటం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. స్టీఫనీ ప్రపంచ సుందరి కిరీటం గెలవటానికి ముందు తన స్వదేశం వ్యూర్టోరికో జాతీయ అందాల పోటీ మిస్ మాండో డెల్ ప్యూర్టోరికో 2016 నెగ్గింది. ఈ అందమైన అమ్మాయి సింగర్ మ్యుజీషియన్  మోడల్ కూడా న్యూయార్క్ లోని పేస్ యూనివర్సిటీ లో అండ్ కమ్యూనికేషన్ లో డబుల్ మేజర్. 8 సంవత్సరాల వయసులో తన దేశం తరఫున అంబాసిడర్ గా బ్రెజిల్ వెళ్లి ప్రతిష్టాత్మక సాన్ జవాన్ చిల్డ్రన్ కోయర్ తో తన తోటి పిలల్లతో కలిసి పాడిందిట. మిస్ వరల్డ్ అవ్వాలంటే కేవలం అందం మాత్రమే కాదు మంచితనం మానవత్వం విద్య విజ్ఞానం అన్నీ ఉండాలి.

Leave a comment