భారత దేశ జల మహిళగా శిప్రా పాఠక్ ఎలాంటి అంతరాయం లేకుండా శుభ్రంగా నదులు ప్రవహిస్తే ఆర్థిక ప్రగతి సాధ్యం అని నమ్మిన శిప్రా పాఠక్ నీటి కోసం జీవితం అంకితం చేశారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ చేసిన శిప్రా సన్యాసాన్ని స్వీకరించి సాధ్విగా  మారారు పంచ తత్వ ఫౌండేషన్ స్థాపించారు ఇందులో 15 లక్షల మంది సభ్యులు ఉన్నారు. నీటి సంరక్షణ కోసం నర్మదా, గోమతి శిప్రా సరయు నది తీరాల్లో పర్యటిస్తూ నీటి పర్యావరణం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు 15 వేల కిలోమీటర్లు పర్యటించారు శిప్రా గ్లోబల్ వాటర్ అంబాసిడర్ గా పిలుస్తారు.

Leave a comment