మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం గనుల్లో పని చేయాలనే నిర్ణయించుకొన్నారు. మైనింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోసం దరఖాస్తు చేస్తే ఒక్క కాలేజీ కూడా ఈమెకు సీటు ఇవ్వలేదు. చదువు విషయంలో లింగ వివక్షకు తావుండకోడదని వాదిస్తూ ఆమె హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. 1996 లో ఆమెకు అడ్మిషన్ దొరికింది. నాగపూర్ లోని రామ్ దేవ్ బాబా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మైనింగ్ ఇంజనీర్ గా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. అదే కాలేజీ లో లెక్చరర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ చంద్రణీ ప్రసాద్ వర్మ. మొట్ట మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్. అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఇప్పటికీ మహిళలకు అనుమతి ఇవ్వడం లేదనే చంద్రణీ వర్మ ఆవేదన. మైనింగ్ రంగంలోకి చంద్రణీ వర్మని స్పూర్తిగా తీసుకొని మరింత మంది మహిళలు వస్తే బావుంటుంది.
Categories