వెడ్డింగ్ సీజన్ లో కంచి పట్టు చీరలను రీప్లేస్ చేసే చీరలు ఏవైనా ఉన్నాయా అంటే లేవనే సమాధానం. నిజమైన నేతకారుల చేతుల్లో, ఆధునిక డిజైన్ లతో కంచి పట్టు ఎప్పుడూ ఎంత ఖరీదైనా వద్దన లేని చీరే. ఇప్పటికీ అందమైన చీరలన్నీ, చీర మొత్తం నేశాక అంచు కలిపి వేయడమే కంచి చీర ప్రత్యేకత. మాష్టర్ చేతుల్లో థ్రెడ్ టెంపుల్ బోర్డర్ చీరలు, ఇతర కాంచీపురం లేటెస్ట్ డిజైనర్ శారీస్ తో సహా ఎప్పుడూ పెళ్లి వేదికపై మేరిసిపోయేవే! అంత దాకా ఎందుకు ఆడ పిల్లల కళ్ళలో ఎట్రాక్షన్ కూడా లేత రంగులున్న పెద్ద కొంగు, చిన్న బోర్డర్ తో ఉండే కాంచీపురం చీరలే. సక్సెస్ సూత్రం మాత్రం కాలానికి అనుగుణంగా డిజైనర్స్ సృష్టించడం. ఆధునిక హంగులతో తీర్చి దిద్దిన ఈ వస్త్ర శ్రేణి ఎప్పుడూ ఆడవాళ్ల దృష్టిలో వంద మార్కులు వేయించుకోనేవే!!

Leave a comment