ఉదయం చక్కగా తయారై పగలంతా ఒకే ఉత్సాహంతో ఆఫీస్ లో పని చేసి ఇంటికొచ్చాక నీరసం అనిపిస్తుంది. ఈ సాకుతో సాయంత్రం స్నానం మానేసి రెస్ట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఉదయపు మేకప్ మొహం నుంచి పూర్తిగా తొలగించాలి. ముఖం పైన ఉండే చర్మ రంద్రాలన్నీ తెరుచుకునేలా హాయిగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. విటమిన్లు అధికంగా వుండే క్రీములు అప్ప్లయ్ చేస్తే రాత్రివేళ ముఖచర్మం సహజమైన మరమ్మతులు చేసుకుంటుంది. మేకప్ వేసుకునే రసాయనాల వల్ల చర్మానికి నష్టమే కదా. నూనె అధికంగా వుండే పదార్ధాలు వేపుళ్ళు , జంక్ ఫుడ్ రాత్రివేళ అస్సలు వద్దు. యాంటీ ఆక్సిడెంట్ కలిగిన కూరగాయలు ముదురు రంగు కలిగిన పండ్లు తినటం ద్వారా చర్మానికి వార్ధక్య లక్షణాలు రాకుండా కాపాడుకోవచ్చు. చలికి చర్మం పొడిబారి పోకుండా స్నానాయికి ముందు ఆలివ్ ఆయిల్ ను చర్మానికి మస్సాజ్ చేసుకుంటే మృదువుగా ఉంటుంది. సోప్ ఫ్రీ క్లీన్సర్ వాడాలి. తేనె నిమ్మరసం అలోవెరా జెల్ బాదం నూనె నిమ్మరసం కలిపిన అవకాడో ఎదో ఒకటి చర్మానికి తగిన సహజ పోషకాలు లభించాలని మరచిపోవద్దు.
Categories