నిరంతరం ఏవో ఫంక్షన్లు వస్తూనే ఉంటాయి. తప్పనిసరిగా వెళ్తాము. గిఫ్ట్ కొనాలనిపిస్తుంది. కానీ ఎలాంటి గిఫ్ట్ . ఈ గిఫ్ట్ కొనే విశదయంలో మొదటి సూచన ఏవిటంటే  ఎప్పుడూ ఎవరో ఒకర్ని వెంటబెట్టుకుని వెళ్లి వాళ్ళ అభిప్రాయాలూ సూచనలు అడగొద్దు. ఇలా అభిప్రాయం తీసుకుంటేనే కన్ఫ్యూజన్. మనం ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనుకొన్నామో ఆ వ్యక్తి ఎవరో, ఎలా వుంటారో, అలవాట్లేమిటో మనకి తెలిసినట్లు మనతో స్నేహంగా వచ్చిన వాళ్ళకి తెలియదు. కనుక ఆ సలహా వినటం వదిలేసి వ్యక్తిగతంగా ఆలోచించుకుని చక్కని బహుమతి ఇవ్వాలి. బడ్జెట్ ప్రాబ్లమ్ లేకపోతే జీవిత కలం గుర్తుండిపోయే వస్తువుకొనచ్చు. ఆభరణాలు యాంటిక్ అలంకరణ వస్తువులు ఖరీదైన బహుమతులు ఇవ్వచ్చు. బహుమతి సర్ప్రైసింగ్ గా  ఉండాలి. ఎదుటివాళ్ళ టేస్ట్ కు నచ్చే  బ్రాండ్ సువాసనలు కలర్స్ ఇవన్నీ  దృష్టిలో పెట్టుకుని కొన్ని వస్తువులు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్న  వస్తువు ఇన్నోవేటివ్ గా  ర్యాప్ చేసి ఇవ్వాలి. ప్యాకింగ్ సరదాగా ఎగ్సయిటింగ్ గా  ఉండాలి. రిబ్బన్లు , స్టిక్కర్లు ,గ్లిట్టర్లను ఏదైనా ఉపయోగించి చక్కని సందేశంతో వున్న  వ్యక్తిగత కార్డును జతచేసి ఇచ్చేస్తే బావుంటుంది.

Leave a comment