కాఫీ ఇష్టం లేనిదెవరికి? ఫిల్టర్ కాఫీ తాగినా లేదా ఇన్స్టెంట్ రుచి అయినా అన్నీ బానేవున్నాయనిపిస్తోంది. వేడిగా కాఫీ వాసనొస్తే చాలనిపిస్తుంది. కానీ కాఫీ మేకింగ్ గొప్ప ఆర్ట్ అనీ దీన్ని ఒక పద్దతి లో కలిపి తేనె అసలైన రుచి అంటారు నిపుణులు. ముందు నాణ్యమైన గింజల్ని రోస్ట్ చేసిన డేట్ చూసి మరీ కొనాలి. గాలి చొరబడని డబ్బాలు నిల్వచేయాలి. ఫ్రీజర్ లో ఉంచకూడదు. వాడే ముందర గింజల్ని గ్రైండ్ చేయాలి. మాములు మంచి నీళ్లు మరగనిచ్చి పొడిని ఫిల్టర్ లో వేసి అందులో నీళ్లు పోసేయాలి. ఫ్రెష్ డికాషన్ దిగుతుంది. వేడి వేడి పాలలో చక్కగా దిగిన డికాషన్ కలిపి పంచదార తగినంత వేసి తాగితే అదే స్వర్గం అనుకోవచ్చంటారు నిపుణులు. సరైన కొలత అంటే ఒక న్యూస్ కాఫీ పొడి అయితే ఆరు జెన్సుల నీళ్లు. అలాగే ఎన్ని కప్పులు కావాలో లెక్కేసుకుని అన్ని స్పూన్లు అన్ని జెన్సుల నీళ్లు పోయాలి. కాఫీ అద్భుతంగా వుండాలంటే ఇదీ పద్దతి. ముందు మంచి గింజలు ఎక్కడ దొరుకుతాయో వెతకాలి.
Categories