జీవితంలో ప్రాధాన్యత క్రమాన్ని సరిగా ఆచరించి తీరాలి. లేకపోతే చేసే పని జీవితసమతౌల్యం గాడి తప్పి లేని సమస్యలు వస్తాయి. ప్రతి పనికీ అది చిన్నదైనా పెద్దదైనా ఒక ప్రాధాన్యతా క్రమం ఉంటుంది. ఉదయం నిద్ర లేవటం కూడా ఒక ముఖ్యమైన పనే. అలా అని కాల్కులేటెడ్ గా యాంత్రికంగా సాగనక్కర్లేదు. ఒక అలవాటుగా పద్దతిగా అన్ని పనులు చేసుకుపోవాలి. సరైన వేలకు ఆఫీస్ కు చేరాలి. ఇది అవసరమైన క్రియ కనుక దానికి తగట్టు సరైన వేళల్లో అన్ని పనులు ప్రణాళికా బద్ధంగా చేసుకోవటం అలవర్చుకోవాలి. హడావుడి టెన్షన్ వద్దు. రేపటి ఉదయం గురించి ఈ సాయంత్రం రాత్రి కొంత ఏర్పాటు చేసుకుంటే ఉదయం పని తీరు తేలికవుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా. అవసరం అనవసరం అన్న ప్రాధాన్యతలు నిర్ణయించుకుంటే ఇష్టం లేకపోతే ఎలాంటి ఆపాలజీలు వివరణలు చెప్పుకోకుండానే ‘నో’ అన్న పదం వాడకుండానే ఇంటి పని ఉద్యోగం రెండు ఒక క్రమంలో పూర్తయి విశ్రాంతి దొరుకుతుంది . కాకపోతే దైనందిన జీవితంలో ప్రాధాన్యతా క్రమం అన్నది తప్పనిసరి అలవాటు కావాలి.
Categories