Categories

ఈ ప్రపంచంలో మొత్తం 16 రకాల అందమైన చెట్లున్నాయిట. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా ‘రోడోడెండ్రాన్’ ప్రాముఖ్యత పొందిందిట. కెనడాలోని లేడి స్మిత ప్రాంతంలో వున్న ఈ చెట్టుని ఇంటర్నెట్ లో చూసి యావత్తు ప్రపంచం ఆహా అందిట. ఇంటి ముందు పెంచుకునే ఒక్క గులాబీ మొక్కకే రెండు పువ్వులు పూస్తే మనస్సు నిండిపోతుంది. అలాంటిది ఈ రోడోడెండ్రాన్ రకం పూల మొక్కలు మొత్తం చెట్టంతా పూలే. అవీ అందమైన గులబీ రకం . పెరిగి పెరిగి వృక్షమైపోయిన ఈ చెట్టు మొత్తం విరగాబూస్తే ఇంకెంత అందం. ప్రకృతి మన కోసం ఇచ్చిన అపురూపమైన కానుకలన్ని తీసుకుంటే వెళ్లి చూడాలి. లేదా నెట్లో వెతుకుంటే ఎన్నో ఇమేజస్.