కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి నో లో నివాసం ఉంటున్న వైద్యనాధన్, టీచర్ గా బ్యాంక్ ఆఫీసర్ గా పని చేస్తారు. స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సవిత ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి వైస్ మేయర్ గా పోటీ చేసి 2014 లో క్యూపర్టి నో సిటి కౌన్సిలింగ్ కు ఎన్నిక అయ్యారు. తాజాగా యూత్ ఎంటర్ టైన్మెంట్స్, సీనియర్స్ అనే వివాదం లో మేయర్ ఎన్నికలకు ప్రచారం చేసి ఏకంగా మేయర్ పీటాన్ని దక్కించుకున్నారు. మన మహిళలు రంగాల్లో సత్తా చూపిస్తున్నారు. అలాగే అమెరికా లో మన దేశ మహిళా మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Leave a comment