ఇది వరకు పూలజడ అంటేనే మల్లేపూలు లేదా నక్షత్ర చామంతులతో జడ కుట్టే వాళ్ళు.  ఘుమఘుమలాడి పోయోలా మొగలి రేకులు పూవ్వులతో అలంకారాలు చేసేవాళ్ళు.  ఇప్పుడు ఆ జడలు నేసే వాళ్ళు ఎక్కడున్నారు.  హెయిర్ స్టైయిలిస్టులే జడ కుట్టాలి.  పూల జడల్లో మల్లెలు, గులాబీ, కనకాంబరాలు కాకుండా నారింజ పసుపు గులాబీ పీచు రంగుల్లో వచ్చే ఆర్కిడ్స్ తో డిజైన్ చేసిన జడలు లేటెస్ట్ ఫ్యాషన్.  ముత్యాలు రాళ్ళు పెట్టి అందంగా డిజైన్ చేసిన ఆర్కిడ్స్ తో ఒక జడ లాగా ఇంకో జడ ఉండటం లేదు.  వీటిని రెడిమేడ్ గా తయారు చేసి ఇచ్చే ఆన్ లైన్ వెబ్ సైట్స్ కూడా చాలానే ఉన్నాయి.  జడలే కాదు రకరకాల హెయిర్ స్టైయిల్స్ కూడా పువ్వుల అలంకరణతో వస్తున్నాయి.

Leave a comment