లేసు ఒక ఫ్యాషనబుల్ ఆర్ట్. ఏ దుస్తులపైనా లేసు అల్లికల్ని జోడించినా సాదాసీదాగా అన్ ఫినిష్డ్ గా ఉన్న ఆ దుస్తుల రూపం మారిపోతుంది. మన దేశంలో లేసుల తయారీ మొఘలాయీల కాలం నుంచి కనిపిస్తోంది. భారతీయ రాచరికపు కుటుంబీకులకు లేసులతో గల అనుభవం పాశ్చాత్య సంస్కృతులతో వారికీ గల సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుందని నేటి ఫ్యాషన్ డిజైనర్లు చెపుతారు.అలనాటి లేసులు కళని భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ అందిపుచ్చుకుని సరికొత్త పోకడలు అద్ది కొత్తదనాన్ని రూపొందించింది సోనమ్ కపూర్. కత్రీనా కైఫ్ ,శిల్పా శెట్టి, కరీనా కపూర్ వంటి సెలబ్రెటీలు లేస్ చీరలు అనేక ఈవెంట్లు పార్టీలలో ధరించి దానికి బోలెడంత మార్కెట్ సృష్టించారు. సవ్య సాటి ముఖర్జీ జె.జె వాలయ వంటి ప్రముఖ డిజైనర్లు ఫ్యాబ్రిక్ ను క్లాసిక్ గా మార్చారు . ఏ రకం వస్త్రాలకైనా లేసులు జోడించి స్వరోస్కీ నెక్లెస్ లు బీడ్స్ ముత్యాలు వంటి అలంకరణ తో ఫ్యాషన్ లేస్ ను ముందువరసలో నిలబెట్టారు.
Categories