Categories
బెంగుళూరుకు చెందిన 21 సంవత్సరాల ఐశ్వర్య పిస్సే కూడా ఈ సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచివేర్స్ అవార్డుకు ఎంపికైంది. తన ధైర్యం, పట్టుదల, కృషికి గానో ఈ అవార్డు లభించింది. ఈమెకు లక్ష రూపాయిల ప్రైజ్ మనీ వుంటుందీ అవార్డుకు. ఐశ్వర్యకు బైక్ రేజింగ్ ఇష్టం. రేజింగ్ కెరీర్ ప్రారంబించిన నాలుగేళ్ళలోనే పేరు మోగే రికార్డులను సొంతం చేసుకుంది. 2014లో సియట్ ఎంటీవి ది చేజ్ సిజన్ లో పాల్గొని గుజరాత్ లోని రాణి ఆఫ్ కట్ నుంచి మేఘాలయ లోని చిరపుంజి వరకు 24 రోజుల్లో దాదాపు 8500 కిలో మిటర్లు ప్రయాణం చేసి రికార్డు సృష్టించింది. 2016 లో రైడ్ ది హిమాలయలో పాల్గొన్న మొదటి యువతి ఐశ్వర్యనే. 2016 మే లో జూనియర్ రేసింగ్ సిరీస్ లో రేస్-1, రేస్-2 లో మొదటి స్థానంలో నిలిచింది.