సంక్రాంతి నెల రోజులూ పల్లెటూర్లలో హరిదాసులు ప్రత్యక్షం అయ్యేవారు. తల పైన గుమ్మడి కాయ ఆకారపు గిన్నె దాని అంచులో పువ్వులదండ నుదుట తిరునామం చేతిలో శృతి వీణ కళ్ళకి గజ్జెలు ధ్వనికి సరిపడే విధంగా ఓ చిన్న నృత్యం గానం చేస్తూ మధ్యలో గుండ్రంగా తిరుగుతుండే విధానం. ఇది హరి దాసు వేషం. తలపైన కనిపించే గుండ్రని గిన్నె భూమికి సంకేతం. దాన్ని తలపైన ధరించి కనిపించటం అనేది ఆ పాత్రలో దానంగా బియ్యం సమర్పించటం అనేక రాబోయే పంట నిమిత్తం ధాన్యాన్ని భూమిలో విత్తనాలుగా వేస్తున్నామన్న సంకేతం. కృషార్పణం అంటూ బియ్యం సమర్పిస్తే శ్రీమద్రమణ గోవిందా అంటూ హరిదాసు స్వీకరించటం ఓ శ్రీహరి ఈ గృహిణి కృతజ్ఞతా భావంతో నీ ప్రతి నిధిగా వచ్చిన నాకు బియ్యాన్ని కానుకగా ఇచ్చిందని చెప్పేందుకు సంకేతం. ఈ భూమి డయాటహో మనకిచ్చిన పంటను ఇతరులకు పంచటం అనే సామజిక విశేషాన్ని తెలియజేస్తుంది హరిదాసు రూపం. హరిదాసు పాడే ప్రభాత భక్తి గీతం ఆరోజంతా ఆ ప్రభావాన్ని మనిషిపైన ఉంచి ఎన్నో సంతోషాలు ఇచ్చి ఈ ప్రకృతి రుణాన్ని ప్రకృతి ఇచ్చిన పంటను అందరికీ పంచి ఆనందిస్తునాన్ని చెప్పటం అంటే అందరం అన్నీ పంచుకోవాలని ఏ మతమైన బోధించే ఆధ్యాత్మిక సత్యం.
Categories
WhatsApp

అందరం అన్నీ పంచుకొమ్మని చెప్పే ధర్మ సూక్ష్మం

Leave a comment