నీహారికా ,

నిజమే నువ్వన్నది. ప్రతి తరం తర్వాత తరాన్ని తక్కువ చేసి మాటాడుతుంది. కొత్త తరం కన్నా తమ తరం మెరుగైనదని చెపుతోంది. నువువ్ ఈ కొత్త తరానికి చెందిన దానివేకదా.. ఇటీవల వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ లో ఈ తరం స్వార్ధ చింతన 58 శాతం మందిలో ఉందని చెపుతోంది. చక్కని  జీతం సౌకర్యాలతో గడుపుతున్నారు. కానీ ఈ తరానికి ఉన్న ఒత్తిడి గతంలో లేదు. ఎన్నో రంగాల్లో ప్రగతి కానీ సామజిక స్పందన చాలా తక్కువ. సాంకేతిక ప్రగతి లో సునాయాసంగా అడుగులేస్తూ ఖండాంతర వివాహాలు కులం మతం తెరలు జారిపడిపోతున్నాయి. కొత్త ఆలోచనలతో గత తరం హక్కు కూడా అందని అంశాలను ఒడుపుగా పట్టుకుని ముందుకెళ్తున్నారు. సేవారంగంలో సత్తా చూపిస్తారు. వేలాదిమందికి మెరుగుపడే ఉపాధి మార్గాలు వెలుగులోకి తెస్తున్నారు. కానీ వస్తావ అంశాలపైనా దృష్టి పెట్టె తీరేలేదా ? సేవాసంస్థలకు ఆర్థికసాయం చేస్తారు కానీ ఆప్తులను పట్టించుకునే అవకాశాలే తీసుకోరు. ఎన్నో రకాలుగా ప్రగతి సాధిస్తున్నారు కానీ తమచుట్టూ ఉన్న సమాజంలో సమస్యలతో ఈ తరానికి సంబంధం లేదు. మనుషుల్లో తడి ఇంకిపోతున్నాదని  ఈ తరం పై పాత తరానికి ఉన్న ఫిర్యాదు. భారత దేశం వచ్చే శతాబ్దం లో యువదేశంగా అవతరించనుంది. ప్రపంచ జనాభా యువ తరమే అధికం యువదేశంగా అవతరించనుంది. ప్రపంచ జనాభాలో యువ తరమే అధికం కదా. చిన్న చిన్న విమర్శలను అర్ధం చేసుకుంటే బావుండదూ..

Leave a comment