మనం ఏం తింటున్నామని ఎంత ప్రధానమో ఎలా తింటున్నామన్నదీ అంతే ముఖ్యం. ఇందులో వంట వండే పద్ధతులదే ప్రధాన పాత్ర. సాధారణంగా మనం వండే వంట ఇబీటి అలవాట్లు సంస్కృతి ఆధునికమైన వస్తువులని వాడుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది. సరైన పద్దతైలో వండితే పోషకాలు పోకుండా ఉంటాయి. ఒక్కో రకానికి ఒక్కో పద్దతి మేలుగా ఉంటుంది. ఆహారాన్ని ఆవిరి పై ఉడికించటం ఆరోగ్యవంతమైన పద్దతి. బీన్స్ క్యారెట్లు బీట్స్ చిలకడదుంపలు చేపలు స్టీమ్ చేస్తే పోషకాలు పోవు. బేకింగ్ డిజర్ట్ లను మాత్రమే పరిమితం కాదు. చికెన్ ఫిష్ కూరగాయలు చివరకు పండ్లు కూడా బేక్ క్రిస్పీ టేస్ట్ ఇస్తాయి. చికెన్ ఫిష్ ఫ్రైయింగ్ కు బేకింగ్ ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం. హై టెంపరేచర్ లోఉడికించే రోస్ట్ లో పోషకాలు ఫ్లేవర్ రెండు సురక్షితంగా ఉంటాయి. చికెన్ రోస్ట్ కోసం ఆలివ్ ఆయిల్ బ్రెష్ చేసి ర్వాక్ పై ఉంచితే కొవ్వు కరిగి కిందకు జారిపోతుంది. ఇక మైక్రోవేవ్ లో ఫ్యాట్ టైమ్ సేవింగ్ కుకింగ్ ప్రక్రియ ఏ పదార్ధాలైనా ఈ పద్దతిలో సేఫ్ గా ఉంటాయి.
Categories