మార్కెట్ లోకి ఆర్ట్ వర్క్ పట్టు చీరలు వచ్చాయి. హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ భార్గవి కాస్ట్యూమ్ డిజైన్ చేసిన ఈ చీరలు నేసే సమయం లోనే పెయింటింగ్ లోని కలర్ కాంబినేషన్ ఎంపిక చేసి పెయింటింగ్ వీవింగ్ కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. చీరల పైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడం ఎప్పటిదో కానీ వీవింగ్ కలర్స్ టెక్నిక్ తో కొత్తగా డిజైన్ చేసిన ఈ చీరలు ‘వివిద్’ అని పేరు పెట్టారు. మోడ్రన్ లుక్ వచ్చేట్లుగా జామెంట్రీ ఫార్మల్, నెమళ్లు, పువ్వులు, లతలు డిజైన్ లో తీసుకున్నారు. ఈ పట్టు చీరలు చాలా ప్రత్యేకం గా ఉన్నాయి. ఆభరణాలు పెద్దగా అవసరం ఉండదు.చీరె డిజైన్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

Leave a comment