అంకిత పూణే లోని భారతీయ విద్యా పీఠ్ మెడికల్ కాలేజీ విద్యార్థిని.గత రెండు నెలలుగా తన స్నేహితులతో కలిసి సౌండ్ పేరుతో చేస్తున్న పాటల ప్రచారం సక్సెస్ అయ్యింది.ఈ ప్రచారంతో వచ్చిన డబ్బులతో ఆరోగ్య కార్యకర్తలకు ఫేస్ షీల్డ్ లు, పిపిఈ కిట్లు ఇస్తోంది. అంకిత 60కి పైగా వివిధ భాషలలో ప్రసిద్ధమైన పాటలు వీడియోలు చేసి కస్టమర్ల ఫోటోలు వీడియోలపైన  అతికించి ఇస్తోంది.ఈ వీడియో కోసం ఒక్క కస్టమర్ నుంచి 55 రూపాయలు తీసుకొంటుంది. ఆ మొత్తంతో ఒక షీల్డ్ వస్తుంది.అలా సేకరించిన డబ్బుతో గ్రేటర్ ముంబై కమిషన్ హెల్త్ కేర్ వైద్యుల కోసం 1000 పిపిఈ కిట్లు సరఫరా చేసింది అంకిత.ఈ వీడియో లకు ఎంతో ఆదరణ లభించింది.

Leave a comment