వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత మాత్రం కోల్పోతాయి అయితే వండటం వల్ల బీటాకెరోటిన్, లికోపెన్ వంటి కాన్సర్ తో పోరాడగల వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి. మైక్రోవేవ్ లో కూరగాయలు వుడికే వాసన వచ్చేదాకా అంటే ఏడు నుంచి పది నిముషాలు. క్యారెట్స్, బంగాళ దుంపలు వంటివి ఐడు నిముషాలు ఉడికిస్తే సరిపోతుంది. కూరగాయల్ని పల్చని స్లైసులుగా కట్ చేస్తే త్వరగా వుడుకుతాయి. ముక్కలు వుడికించే ముందే బాగా వేడి చేస్తే త్వరగా కూర ముక్కలు వేడిగా అయిపోతాయి. ఎక్కువ పోషకాలు పోవక్కరలేదు. తరచూ కలియబెడుతూ వుండాలి. ఒకటి రెండు నిమిషాలకు రుచి చూడాలి. ప్యాన్ అడుగున ఏదైనా లిక్విడ్ మిగిలిపోతే మళ్ళి కలియబెట్టాలి. కూరగాయలు ఉడికించిన నీటిని ఎప్పుడు వృధా చేయకూడదని. ఆ నీటితో చారు వంటివి చేసుకున్న ప్రయోజనమే.

Leave a comment