నెయ్యి ఫ్యాట్ ఫ్యామిలీ లో లేదన్నది ఒక రుజువైన రిపోర్ట్. కమ్మని కబురు కూడా. ఎంతో రుచిగా వుండే నెయ్యిని ఆహారంలో భాగంగా లేకుండా చేసుకుంటున్నామే అని ఓ వైపు శరీరంలో కొవ్వు పేరుకుంటుందేమో నన్న భయం ఇంకోవైపు మనసులోతుల్లో ఎక్కడోవేధిస్తుంటుంది . ఇప్పుడా సందేహాలకు ఇక నిస్సందేహంగానో చెప్పేయచ్చు. గుండెకు ప్రయోజనం చేకూర్చే విటమిన్ ఇ ని శరీరం గ్రహించటానికి నెయ్యి అవసరం. పూర్వం నెయ్యి తగలేకపోతే చర్మం పొడిగా అయిపోతుందనేవారు నెయ్యిలో లాక్టోజ్ వుండదు కొలెస్టరాల్ భయం ఉంటే కాస్త తక్కువ వాడుకోవచ్చు. అందాన్ని నాజూకుతనాన్ని ఇవ్వటంలో నెయ్యి తిరుగులేని సాత్వికాహారం వెన్న కంటే సురక్షితమైనది నూనె కంటే పోషకమైనది. పాలపై మీగడను రెండు రోజుల పటు తీసి వేరే గిన్నెలో తోడుపెడితే ఆ పెరుగులో కొన్ని నీళ్లు పోసి కవ్వంతో గానీ బ్లెండర్ తో గానీ చిలికితే వెన్నపూస పేరుకుంటుంది. దాన్ని ముద్ద చేసి నీళ్లతో కడిగి బాండీలో గాని పాత్రలో గాని వేసి బంగారు వచ్చే వరకు కరగనిస్తే మంచి నెయ్యివుతుంది. మిగతా వెజిటబుల్ ఆయిల్స్ కంటే స్మోకింగ్ పాయింట్ పై స్థాయిలో ఉంటుంది. కాబట్టి వేపుడులకు సరైనది. అత్యధిక సెగలో కూడా దీని రసాయన గుణం ఏమాత్రం మారదు. దీర్ఘ కాలం నిల్వ ఉంటుంది.
Categories