తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ సమంత తనవంతు సేవలు అందించేందుకు అంగీకరించింది. మెట్రో రైల్ భవన్ పై మినిష్టర్ కేటీఆర్ ను కలిసిన సమంత చేనేత పరిశ్రమ పట్ల తనకున్న ఇష్టాన్ని గురించి అయిన తో మాట్లాడింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగా ఉంటానని వివిధ రకాల చేనేత చీరల గురించి తానూ అధ్యయనం చేశానని చెప్పింది సమంత. గద్వాల్ పోచంపల్లి వంటి నేత రకాల చీరలతో వస్తున్న మోడ్రన్ ట్రెండ్స్ గురించి ఆమె మంత్రితో చర్చించారు. చీరల అమ్మకాలు పెంచేందుకు గానూ తీసుకు రావలిసిన కొత్త ఆలోచనలు తనకు ఉన్నాయని వీవర్స్ తో కలిసి తానూ ఆ పద్దతులను ఆచరణ లోకి తెస్తానని చెప్పింది సమంత. తెలంగాణ హ్యాండ్లూమ్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవహరించాల్సిందిగా మంత్రి కేటీర్ కోరటంతో తన అంగీకారం చెప్పింది సమంత మంత్రి కేటీర్ ఆమెకు అందమైన పోచంపల్లి చీరను కానుకగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమంత తో పాటు టి. ఎస్. సి. డైరెక్టర్ శైలజ రామయ్యర్ ఇండస్ట్రీస్ ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Categories