కాస్త ఆసరా దొరికితే అల్లుకుపోయే పొట్ట తీగలకు కాసే పొడుగాటి పొట్లకాయల్లో పోషకాలనేకం ఉంటాయి. నీటి శాతం ఎంతో ఎక్కవవుండే ఈ కాయలు ఐదు అడుగుల పొడవు దాకా పెరుగుతాయి. క్యాలరీలు లేవు. సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్లు విటమిన్ A ,B,C మాంగనీస్ కాల్షియం పొటాషియం ఐరన్ అయోడిన్ వంటి ఖనిజాలు పొట్లకాయలు ఉన్నాయి. శారీరక ద్రవాల ఉత్పత్తిని పెంచి శరీరాన్ని తేమగా ఉంచుతోంది . జుట్టు రాలిపోతున్నప్పుడు పొట్లకాయను ఔషధంలా ఆహారంలా చేర్చుకుంటే జుట్టుకుదుళ్లు బలపడి శిరోజాలు బాగా ఎదుగుతాయి. పొట్లకాయ రసం అప్లయ్ చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. పొట్లకాయ యాంటీ బయోటిక్ హెర్బ్. స్థూలకాయాన్ని తగ్గించటంలో శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్ని మెయిన్ టెయిన్ చేయటంలో ఉపకరిస్తుంది. జ్వరం వచ్చి కోలుకుంటున్న వారికి పత్యంగా పొట్లకాయ పెడతారు. ఇది బలం వుంచుకునేట్లు ఉపయోగపడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవు. మనిషిని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంచుతుంది.
Categories