ఎంత తెల్లారి పోయినా కళ్ళు విప్పకుండా నిద్రపోతూ ఇంట్లో అందరు నిమిషానికోసారి లేపుతున్నా నిద్ర లేవని వాళ్ళకో శుభవార్త . రాత్రిపూట ఎక్కువ గంటలు నిద్రపోతేనే మూడ్ శక్తి  స్థాయిలు చాలా ఎక్కువగా వుంటాయని పరిశోధన ఫలితం. నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో ఏడు గంటలు కంటే ఎక్కువ నిద్రించే వాళ్ళతో పోలిస్తే రక్తపోటు ఎక్కువగా ఉందిట. అంటే నాలుగైదు గంటల నిద్ర చాలు అని సరిపెట్టుకుంటే రక్త పోతూ ఎక్కువవుతుంది. ఇక ఎక్కువ నిద్ర పోవటం వల్ల  ఎన్నో లాభాలున్నాయని శరీరం ఎంతో సేద తీరి శక్తివంతంగా ఉంటుందని హాయిగా నిద్రపొమ్మని సూచిస్తున్నాయి అధ్యయనాలు. ఏడు  గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే వెంటనే నిద్రొచ్చినంతసేపు నిద్రపోండి. ఎవరైనా లేపితే బిపి తగ్గుతోంది అందుకే పడుకున్నా   అని చెప్పేయండి.

Leave a comment